హైదరాబాద్ మార్చి 11
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ మోసాలకు సహకరిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల పేరుతో తీసుకున్న సిమ్ కార్డులను మోసపూరిత కార్యకలాపాల కోసం వారు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.నిందితులైన
మహమ్మద్ సయీద్ ఉద్దీన్ @ ఫరీద్ (26), ప్రైవేట్ ఉద్యోగి (దుబాయ్), నివాసం: ఫతేషా నగర్, ఈడి బజార్, సంతోష్ నగర్, హైదరాబాద్ మహమ్మద్ తాజుద్దీన్ (31), ఆటో డ్రైవర్, నివాసం: నయారా పెట్రోల్ పంప్ సమీపంలో, మోయిన్‌బాగ్.
మహమ్మద్ యూనస్ @ అర్బాజ్ (25), వ్యాపారం, నివాసం: మోయిన్‌బాగ్.
- A4: ఎండి. అయూబ్ (24), ప్రైవేట్ ఉద్యోగి, నివాసం: మోయిన్‌బాగ్. హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తికి 2025లోBETINEXCHANGE ప్రతినిధులమని చెప్పుకుంటూ వాట్సాప్ సందేశాలు, కాల్స్ పంపారు. క్రికెట్ బెట్టింగ్, తీన్ పట్టి, క్యాసినో వంటి ఆటల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి అతడిని ప్రలోభపెట్టారు. తొలుత రూ20,001 డిపాజిట్ చేయగా రూ5,000 లాభం రావడంతో బాధితుడు వారిని నమ్మాడు.
ఆ తర్వాత నిందితుల ప్రోద్బలంతో బాధితుడు తన అకౌంట్, తన భార్య బ్యాంక్ ఖాతాల నుండి 2025 నుండి జనవరి 2026 మధ్య సుమారు రూ1.5 కోట్లు వివిధ యూపీఐ ఐడిలు, క్యూఆర్ కోడ్లు మరియు క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా చెల్లించాడు. ప్రారంభంలో రూ 20 లక్షలు లాభంగా చూపినప్పటికీ, చివరకు మొత్తం సొమ్మును కోల్పోయాడు. బాధితుడు నగదు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, మోసగాళ్లు రకరకాల పేర్లతో (BETINEXCH.COM, FUNINEXCHANGE మొదలైనవి) వెబ్సైట్ డొమైన్లు మారుస్తూ అతడిని తప్పుదోవ పట్టించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఫరీద్ గతంలో దుబాయ్‌లోని క్రికెట్ బెట్టింగ్ కాల్ సెంటర్లో పనిచేశాడు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, స్థానికంగా ఉన్న వారికి ఒక్కో సిమ్ కార్డుకు రూ 600 ఇస్తానని ఆశ చూపి సిమ్ కార్డులు సేకరించాడు.
మిగిలిన ముగ్గురు నిందితులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో సిమ్ కార్డులు సేకరించి ఫరీద్ కు అందించారు.ఆ సిమ్ కార్డులను దుబాయ్‌లో
ఉన్న గుజరాత్‌కు చెందిన ముదస్సిర్‌కు ఒక్కోదానికి రూ 1200 ల చొప్పున విక్రయించాడు. ఇలా సుమారు 250 సిమ్ కార్డులను సరఫరా చేశాడు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితులు ఈ సిమ్ కార్డుల ద్వారా నకిలీ బెట్టింగ్ వెబ్సైట్లు సృష్టించి, కస్టమర్ కేర్ ప్రతినిధులలా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనీ పోలీసులు తెలియ జేశారు.
నిందితులనుంచి 5 మొబైల్ ఫోన్లు, స్వాదీనం చేసుకున్నారు.ఇన్స్పెక్టర్ పి. శివ చంద్ర నేతృత్వంలో ఎస్.ఐ. ఎ. ఉమ, హెచ్.సి. సునీల్ కుమార్ మరియు పి.సి.లు గణేష్, సందీప్, విజయ్ కుమార్, మనీష్ కుమార్, ధరణి, శివ కుమార్ ఈ కేసును ఛేదించారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.సోషల్ మీడియాలో వచ్చే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనే బెట్టింగ్ ప్రకటనలను నమ్మవద్దు అన్నారు.తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దు లేదా అనధికారిక యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దన్నారు.మీ ఓటిపి (OTP), పిన్ (PIN) లేదా బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దు.ప్రారంభంలో వచ్చే లాభాలు మిమ్మల్ని నమ్మించడానికి చేసే మాయాజాలం మాత్రమే అని గ్రహించాలన్నారు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
