సంవత్సరం అంతా కష్టపడి చదివినా ఉత్తమ మార్కులు సాధించాలంటే చేతి వ్రాత సక్రమంగా వ్రాస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమని వికే ఉన్నత పాఠశాల పదవ తరగతి వంద రోజుల ప్రణాళిక ప్రత్యేక అధికారి, ఎవో ప్రసాద రావు అన్నారు. వికే ఉన్నత పాఠశాలలో గురువారం పదవతరగతి విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ మార్కుల సాధనకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి విద్యాశాఖాధికారి -2 నుధాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు ఆరోన్ మిల్టన్, ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.
