జిల్లాలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో విద్యార్ధులు పరీక్షలు రాసేలా అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
పేర్కొన్నారు.
సోమవారం ఒంగోలు నగరంలోని పివిఆర్ బాలికల, బాలుర పాఠశాలలో మరియు గౌతమ్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్ధులకు కల్పిస్తున్న వసతులను, ఏర్పాట్లను పరిశీలించి ఏర్పాట్లు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని, ఎక్కడా చిన్న లోటుపాట్లు ఉండకూడదని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. , ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ… ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు జరుగుచున్నవని, అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 165 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో విద్యార్ధులు పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖ అన్నీ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 165 పరీక్షా కేంద్రాలలో 28,632 మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హాజరు ఆగుచున్నట్లు కలెక్టర్ వివరించారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పదిమంది బాలికలు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా మంచి వాతావరణంలో విద్యార్ధులు పరీక్షలు రాసేలా అన్నీ ఏర్పాట్లతో పాటు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని కూడా అవసరమైన మందులతో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.

