బేగంపేట మార్చి 24,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మా సీతా,రాముల కల్యాణాన్ని కళ్ళారా వీక్షించేందుకు రారండోయ్ అంటూ ఆహ్వానిస్తున్నారు బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ షాపర్స్ స్టాప్ వెనుక వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ అమరం శ్రీనివాసరెడ్డి,వసంత దంపతులు ,కమిటీ సభ్యులు.స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి (శుక్రవారం)మధ్యాహ్నం గం 12.15 నిమిషాలకు పునర్వసు నక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ సుముహార్తమున చి.శ్రీరామ చంద్ర మూర్తి చి. ల. సౌ సీతా మహా దేవీ నీ ఇచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే సుముహూర్తం నిర్ణ యించినారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి తరించేందుకు ఆలయానికి రావాలని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి,ఇన్స్పెక్టర్ సైదులు ను ఆలయ కమిటీ చైర్మన్ అమరం శ్రీనివాసరెడ్డి తో పాటు కమిటీ సభ్యులు రాకేష్,విజయ్ కుమార్, వారికి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి భక్తులు తరలి వచ్చి స్వామివారి,అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆలయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు చైర్మన్ అమరం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

