తాళ్లూరు
మండల కేంద్రంలోని తాళ్లూరు కెనరా బ్యాంకు బ్రాంచి నూతన కార్యాలయ ప్రాంగణం శుక్రవారం ప్రారంభించారు. కెనరా బ్యాంకు తిరుపతి సర్కిల్ చీఫ్ జనరల్ మెనేజర్ పాండురంగ మితంథాయా, ఒంగోలు ఆర్ హెడ్ ఆఫీస్ ఎజీఎం బీమా రాఘవేందర్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్న నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు.
వినియోగదారులకు నూతన ప్రాంగణం మరింత సౌకర్యవంతంగా మెరుగైన సేవలు అందించటానికి వీలుగా ఉంటుందని తెలిపారు. నూతనంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకు మెనేజర్ ఎ సాయి పృద్వి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
