బేగంపేట ఏప్రిల్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పాటిగడ్డలోని యేసు క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుదాం లు పాల్గొన్నారు.అత్యంత భక్తి,శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు.చర్చ్ పాస్టర్ రవి కిరణ్ మార్గ దర్శకత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు.
అతిథులను, భక్తులను పాస్టర్ రవి కిరణ్ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు, శాంతి సందేశాలు, ఐక్యత భావనతో కూడిన సందేశాలు ఇచ్చారు. ఇవి ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను ప్రతిబింబించాయి.ఈ సందర్భంగా డా. కోటా నీలిమ మరియు విశాల్ సుదామ్ తో కలసి మహిళలకు చీరలను పంపిణీ చేసి, వారికి ఆనందాన్ని పంచుతూ, సమాజానికి సేవ చేయాలనే భావాన్ని చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులువి. చిరంజీవి, ఇబ్రహీం పటేల్, నసీర్ (అడ్డూ), మునీర్ ఖాన్, అశోక్, తస్లీమ్, సిద్దిక్, దేవేందర్, గౌస్, శేఖర్, కృష్ణ, వెంకట రమణ, రోజా, భీమ్ తదితరులు పాల్గొన్నారు.


