తాళ్లూరు లో బాబు జగ్జీవన్ రామ్ కి ఘన నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేదని వక్తలు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురష్కరించుకొని తాళ్లూరులోని వెల్లంపల్లి రోడ్ లో
ఆయన విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలువ వేసి నివాళులు అర్పించారు. అనంతరం సరస్వతి విద్యాసంస్థల సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టిడిపి గ్రామపార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపర్తి సుబ్బా రావు, ఎంఆర్పీఎన్ నాయకులు అనపర్తి ఆదాం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *