వైసీపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిజన్మదిన వేడుకలు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. తేజ వయో వృద్ధాశ్రమంలో తూర్పుగంగవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంచి పెట్టారు. గుంటి గంగా భవాని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, కైపు వెంకట క్రిష్ణా రెడ్డి, దద్దుకూరి శ్రీనివాస రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు లతీఫ్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి పూనూరి దేవదానం, ఫజుల్, మాజీ సర్పంచి కోటేశ్వర రావు, వంశీ, మునలా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిని కలసి గజ మాల శాలువతో నన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశ మధుసూధన రెడ్డి, మాజీ నర్పంచిలు మారం ఇంద్రసేనా రెడ్డి, పులి క్రిష్ణా రెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, హనుమంత రావు తదితరులు జన్మదిన శు భాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.


