కంటోన్మెంట్ ఏప్రిల్ 14 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
అంబేద్కర్ గొప్ప మానవతావాద్యాన్ని కుల మత వర్గ బేధాలు లేకుండా అందరికీ సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగ సభలో కొట్లాడిన గొప్ప వ్యక్తిని బోయిన్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి ని పురస్కరించుకొని కంటోన్మెంట్ బాలం రాయి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముప్పిడి గోపాల్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు రాజు, దర్గా రవికుమార్, శేఖర్ ధర్మేందర్, పరమేష్ ,వినోద్, మహేష్ ,బాబా ,కృష్ణ గిరి తదితరులు పాల్గొన్నారు.
