కంటోన్మెంట్ ఏప్రిల్ 14 , (జె ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజకవర్గం డైమండ్ పాయింట్ రాజ రాజేశ్వరీ రూఫ్ గార్డెన్స్ లో కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ & ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా రహదారి భద్రతపై పోలీస్ అధికారులతో కలిసి స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని, కుల వివక్షను ఎదుర్కొని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసి దేశ,విదేశాలలో చదువుకున్న గొప్ప వ్యక్తని, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని అన్నారు. వారి రాజ్యాంగం ద్వారానే ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు, హక్కులు లభిస్తున్నాయని, వారి అడుగుజాడలలో నేటి తరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే కంటోన్మెంట్ లోని ఎంప్లాయిస్ కు కంటోన్మెంట్ బోర్డు స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని దీన్ని ఎజెండాగా తీసుకోవాలని కంటోన్మెంట్ బోర్డు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ఎసిపి గోపాలకృష్ణమూర్తి, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మహేందర్ , శశాంక్ , పరశురాం తదితరులు పాల్గొన్నారు.

