తాళ్లూరు మండలంలో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తాళ్లూరు వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో 35 మంది విద్యార్థులకు గాను 32 మంది విద్యార్థులు పాసై 91శాతం నమోదు చేసినట్లు ఆర్ ఐఓ, డి ఐ ఈఓ మరియు ప్రిన్సిపాల్ కె అంజనేయులు తెలిపారు. ద్వితీయ సంవత్సరం సీఈసీలో జి అఖిల (942), ఈఈటీలో శ్రీ హర్షిణి (975) మొదటి స్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం లో 40 మందికి గాను 36మంది ఉత్తీర్ణత సాధించి 90శాతం ఉ త్తీర్ణత శాతం సాధించారు. ఎంపీనీలో ఎ గీత (451), సీఈసీలో ఎం సత్యవాణి (458), ఈఈటీ లో సీహెచ్ రాజ్యలక్ష్మి (479) సాధించి ఆయా గ్రూప్లలో ప్రధమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు, సిబ్బందికి విద్యార్థులకు ఆర్ ఐఓ, డి ఐ ఈఓ మరియు ప్రిన్సిపాల్ కె అంజనేయులు అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కస్తూరిభాలో …… కస్తూరిభా గాంధీ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో బైపీపి గ్రూప్ లో 25 మంది గాను 25 మంది ఉత్తీర్ణులై నూరుశాతం సాధించినట్లు ప్రిన్సిపాల్ నుజిత తెలిపారు. బి మెరినా (909) అధిక మార్కులు సాధించి కళాశాలలో ప్రధమ స్థానంలో నిలిచారు. ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో బైపీసీ గ్రూప్లో 31 మందికి గాను 23 మంది ఉత్తీర్ణత సాధించి 74.19 ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. జి స్మైలీ (421) సాధించినట్లు తెలిపారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“default”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“addons”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *