పొదుపు సంఘ మహిళలు సైబర్ నేరాలు, ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండి తమ
కుటుంబసభ్యులను తోటి పొదుపు సంఘ మహిళలను అప్రమత్తం చెయ్యాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరులో పొదుపు సంఘ మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. ఐ మాట్లాడుతూ వేసవి సెలవులు ఇస్తున్నందున ఇప్పటికే పరీక్షలు అయి పోయి ఖాళీగా ఉంటున్న విద్యార్థులు ఈత సరదాతో బయటకు వెళ్లి ప్రమాదాలకు గుయి అయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా
ఉండాలని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్రికెట్ బెట్టింగ్లను ఎవరైనా పాల్పడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని అన్ని విషయాలలో తోటి నమాజాన్ని అప్రమత్తం చెయ్యాలని కోరారు. ఎపీఎం దేవరాజ్, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.


