హైదరాబాద్, ఏప్రిల్ 22,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం (ఏప్రిల్ 22, 2026) ఉదయం పరమపదించారు. వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీ నాదెండ్ల భాస్కర రావు వయసు 90 సంవత్సరాలు.
కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్ లోని నాదెండ్ల స్వగృహం లో అందుబాటులో ఉంచనున్నారు.
హైదరాబాద్ లోని పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నాదెండ్ల భాస్కర రావు కుటుంబ సభ్యులకు సూచించారు. భాస్కర రావు ఆకాంక్ష మేరకు గురువారం ఏప్రిల్ మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
