నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు – నిందితుల అరెస్ట్.

హైదరాబాద్ ఏప్రిల్ 22
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు, వాహనం యొక్క అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చి, నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తున్న నిందితులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులైన వాహన యజమాని షేక్ అబ్బు బాబా (41) షేక్ రిహాన్ (19 ) వాహనాన్ని నడుపుతున్న
షేక్ రిహాన్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.వీరిద్దరూ రామంతాపూర్‌లోని
నవరంగ్ గూడ కు చెందిన వారన్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో, నిందితుడైన షేక్ రిహాన్ తన హీరో గ్లామర్ మోటార్ సైకిల్ అసలు నంబర్ TS08FB2768 ను, ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో TS08FE2768 (హోండా యాక్టివా) గా మార్చినట్లు గుర్తించారు. ఇలా నకిలీ నంబర్ ప్లేట్‌ను వాడటం వల్ల, నిందితులు చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలానాలు అసలైన హోండా యాక్టివా యజమాని అయిన కూకట్‌పల్లి నివాసి ఎ. లక్ష్మి పేరిట తప్పుగా
నమోదయ్యాయి.ఈ ఘటనపై కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 318(4), 319(2) మరియు మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 80(a) కింద కేసు నమోదు చేశారు. నిందితులకు BNSS సెక్షన్ 35(3) (పూర్వపు Cr.P.C. 41) కింద నోటీసులు జారీ చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు కాచిగూడ లా అండ్ ఆర్డర్ పోలీసులుసమన్వయంతో పనిచేసి ఈ మోసాన్ని బయటపెట్టారు.నకిలీ, తప్పుడు లేదా నంబర్లను మార్చిన నంబర్ ప్లేట్లను ఉపయోగించడం భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటార్ వాహనాల చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ వద్ద ఉన్న అత్యాధునిక CCTV సర్వైలెన్స్ మరియు ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాల ద్వారా ఇటువంటి మోసపూరిత వాహనాలను సులభంగా గుర్తించవచ్చన్నారు. పౌరులు ఎవరైనా తమ వాహన నంబర్ ప్లేట్ దుర్వినియోగానికి గురవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *