లక్కవరం ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కంటైనర్ పూర్తిగా దగ్ధమైనది. దీంతో ఆ కంటైనర్ ను ఆవాసంగా చేసుకున్న ఉంటున్న ఎస్సీ కాలనీకి చెందిన కూకట్ల వీర బ్రహ్మాం కుటుంబం కట్టు బట్టలతో మిగిలారు. వీర బ్రహ్మాం కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఫిల్లర్స్ వేయగా నివాసం మంజూరు కాలేదు. దీంతో తాత్కాలికంగా ఒక కంటైనర్ను కొనుగోలు చేసి అందులో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఒంగోలు వెళ్లగా పిల్లలు వారి నాయనమ్మ వారి ఇంటి వద్దకు మధ్యాహ్నం బోజనానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా మంట, పొగలు వస్తుండటంతో గమనించి స్థానికులు యజమాని బ్రహ్మానికి సమాచారం అందించారు. దీంతో ఆయన తన స్నేహితుల సహకారంతో టోల్ ఫ్రీ నంబర్లను ఫోన్స్ చేయగా స్పందన లేదు. ఎట్టకేలకు దర్శి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా నకాలంలో వచ్చి మంటలను అదుపు చేసారు. లేక పోతే గ్రామంలో చుట్టూ ఉన్న వాములతో పాటు టెంట్ సామగ్రి దగ్ధం అయ్యేది. బ్రహ్మంకు చెందిన కంప్యూటర్లు, ల్యాప్ ల్యాబ్ తో పాటు మార్కులిస్ట్లు, పిల్లల పుట్టిన తేది నర్టిఫికేట్స్ విలువైన పత్రాలు, బట్టలు, వంట సామగ్రి అన్ని తగుల బడి పోయారు. వాటి విలువ రూ. 7 లక్షల వరకు ఉ ంటుందని బాధితుని బంధువులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

