ఇంధన కొరత లేదు అవసరమైన మేర మాత్రమే కొనుగోలు చెయ్యాలి

ఇంధన కొరత లేదని అవసరమైన మేర మాత్రమే కొనుగోలు చెయ్యాలని తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. మండలంలోని తూర్పుగంగవరం, తాళ్లూరు, బొద్దికూరపాడులలోని ఇంధన ఫిల్లింగ్ స్టేషన్లను రెవిన్యూ, పోలీన్ అధికారులు, సిబ్బంది సందర్శించారు. ఆయా ఫిల్లింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను, మరలా వచ్చు నిల్వల గురించి ఆరా తీసారు. వినియోగదారులు అవసరమైన మేర మాత్రమే ఇంధనాన్ని తీసుకువెళ్లాలని, ఇంధనం దొరకదు అన్న ఆందోళనతో మరింత కొనుగోలు చెయ్యవద్దని చెప్పారు. డీలర్లు ఇంధనం ఇవ్వటానికి పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ప్రస్తుతం మండలంలోని 8 ఫిల్లింగ్ స్టేషన్లలో 18,614 లీటర్ల పెట్రోలు, 12,614 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉన్నట్లు తహసీల్దార్ ఫణీంధ్ర తెలిపారు. సోమవారం రాత్రి, మంగళవారం సాయంత్రం కల్లా మండలంలో 26వేల లీటర్ల పెట్రోలు, మరో 66వేల డీజిల్ అందుబాటులో ఉంటుందని అందుకు సంబంధించి ఇండెంట్ను ఫిల్లిండ్ స్టేషన్ డీలర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఆయా ఫిల్లింగ్ స్టేషన్లకు విఆర్డీలను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఆయన వెంట ఆరి సుధీర్, కంప్యూటర్ ఆపరేటర్ చందు లు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *