బేగంపేట ఏప్రిల్ 28 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మలానీ హౌస్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టపగలే ఓ వృద్ధురాలి మెడలోంచి దుండగుడు బంగారు గొలుసును తెంచుకెళ్లాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మలానీ హౌస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న టి. వసంత కుమారి (61) ఉదయం పదిన్నర గంటల సమయంలో విధి నిర్వహణకు వెళ్తుండగా, వెనుక నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 6 గ్రాముల బంగారు మంగళసూత్రం గొలుసును లాక్కొని పరారయ్యాడు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె సహోద్యోగి సురేష్ బైక్‌పై నిందితుడిని ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ వరకు వెంబడించినప్పటికీ, దుండగుడు తప్పించుకున్నాడు. వెంటనే బాధితురాలు 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సిసిటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బేగంపేటలో పట్టపగలే చైన్ స్నాచింగ్మహిళా సెక్యూరిటీ గార్డు మెడలో గొలుసు అపహరణ
28
Apr