బేగంపేట మే 4,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత ప్రదర్శన కనపరచడంపై సనత్ నగర్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ సాధిస్తున్న ఆధిక్యతపై హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి యువ నాయకులు మర్రి పురు రవ రెడ్డి నేతృత్వంలో బేగంపేట మోతిలాల్ నెహ్రూ నగర్ లోని బిజెపి కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి సంబరాలు జరుపుకున్నారు.
బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేటలోని నియోజకవర్గ కార్యాలయం వద్ద ఈ వేడుకలు మిన్నంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వాన్ని కొనియాడుతూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవా కొనసాగుతోందని, ఈ ఫలితాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పురవరెడ్డి అన్నారు.
ఈ విజయ వేడుకల్లో మర్రి పురురవ రెడ్డితో పాటు ఎం. మహేష్ కుమార్ ముదిరాజ్, సంధ్య లక్ష్మీ, లోహిత్, బాబు రావు, గుంటి సత్యనారాయణ, కిరీట, మాంచాల గోపి, బి. వికాస్, గోపి శ్రీనివాస్, కె. నరేష్, పిట్ల శ్రీనివాస్, కె. శ్రవణ్, సగత్ వాళ్ళ వంశీ, ప్రమోద్, దుర్గేశ్, విశాల్, రాజ్ కుమార్ తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


