బాలకల సాధికారిత వేసవి కార్యక్రమం విజయవంతం చెయ్యాలి.

కిషోర వికానంలో బాగంగా బాలికల సాధికారిత వేనవి కార్యక్రమాన్ని మండల స్థాయిలో అధికారులు అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చెయ్యాలని ఎంపీడీఓ పి అజిత కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశపు మందిరంలో సోమవారం బాల బాలికల సాధికారిత వేసవి కార్యక్రమం అమలుపై మండల స్థాయి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, ఎంపీడీఓ అజిత, సీడీపీఓ ఆర్ పరిమళ, పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, ఎంఈఓ-2 సుధాకర్ రావు, ఎపీఎం దేవరాజ్, జిల్లా కోఆర్డినేటర్లు ఎన్ వీరాంజనేయులు, ఎ దేవ కుమార్, సూపర్ వైజర్ సునీతలు పాల్గొని కిషోర వికాసం వేసవి కార్యక్రమ అమలు, కమిటీల ఏర్పాటు గురించి చర్చించారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరముల పిల్లలకు విద్య, నంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం బుతు శుభ్రత మరియు లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం, బాల్య వివాహాల నిషేద చట్టం, టీనేజ్ ప్రెగ్రెన్సీ చట్టం తదితర అంశాల పై మండల స్థాయి అన్ని విభాగాల సహాకారంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాల్సిన విధానం గురించి సీడీపీఓ ఆర్ పరిమళ వివరించారు. తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో బాగస్వామ్యులను చేయటం ద్వారా బాల్య వివాహాలు, బాల కార్మికులు లేకుండా చూడవచ్చని, న్కూల్స్లో డ్రాప్ అవుట్స్ తగ్గించవచ్చని వక్తలు అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *