ఉజ్వల భవిష్యత్తుకు ఊపిరి పోసే..మన సంక్షేమ హాస్టళ్లు! -. ప్రకాశం, మార్కాపురం జిల్లాల విద్యార్థులకు సువర్ణావకాశం -ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ప్రవేశాలు ప్రారంభం- సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు నేడు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి. పేద విద్యార్థుల కలలకు కార్పొరేట్ స్థాయి వసతుల దన్నునిస్తూ, వీటిని కేవలం వసతి కేంద్రాలుగానే కాకుండా ప్రతిభను వెలికితీసే ‘ప్రగతి నిలయాలు ‘ గా తీర్చిదిద్దామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ తెలిపారు. వీటిల్లోకి ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రభుత్వ వసతులతో ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు లక్ష్మానాయక్
పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అత్యుత్తమ ఉత్తీర్ణత

సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో సాధించిన అద్భుత ప్రగతే వీటిల్లోని విద్యా ప్రమాణాలకు నిదర్శనం. మొత్తం 936 మంది హాజరుకాగా 88% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

జిల్లాల్లోని 23 హాస్టళ్లు 100% ఉత్తీర్ణత సాధించాయి. *. అత్యధికంగా 583 మార్కులతో ప్రభంజనం. తాజా ఫలితాలలో 550 పైగా మార్కులు 58 మందికి, 500-549 మధ్య 137 మందికి లభించాయి. *. ఏకంగా 772 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు వసతులు:నవీకరించబడిన భవనాలు, RO ప్లాంట్ల ద్వారా శుభ్రమైన త్రాగునీరు మరియు సిసి (CCTV) కెమెరాల నిఘాలో పూర్తి భద్రత. పౌష్టికాహారం: వారానికి మూడు సార్లు చికెన్, ఆరు రోజులు గుడ్లు, పండ్లు, చిక్కీలు మరియు రాగి జావతో కూడిన బలవర్ధకమైన ఆహారం. ఉచిత సామాగ్రి: బెడ్ షీట్లు, ట్రంక్ బాక్సులు, నోట్ బుక్స్, స్వెటర్లు, టవల్స్, ప్లేట్ మరియు గ్లాస్ ఉచితంగా అందజేయబడతాయి. స్టడీ మెటీరియల్ : 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయబడుతుంది. ప్రవేశాల వివరాలు అర్హత : 3వ తరగతి నుండి పీజీ (PG) వరకు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: మీ గ్రామంలోని సచివాలయ వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా, లేదా నేరుగా దగ్గరలోని హాస్టల్ వార్డెన్/అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *