బేగంపేట మే 6(జే ఎస్ డి ఎం న్యూస్)
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లనుదర్శించుకున్నారు. బుధవారం తమ పెళ్ళి రోజు సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పండితులు తలసాని దంపతులకు ఈ ఓమనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో
పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.తలసాని శ్రీనివాస్ యాదవ్,స్వర్ణ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పలువురు తలసాని దంపతులను శాలువాలు, పూలమాలతో సత్కరించి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు గందే నాగులు, కిషోర్, ఆంజనేయులు, కొండాపురం మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, ప్రేమ్, బచ్చు మహేష్, రాంమోహన్ యాదవ్, ఓదెల సత్యనారాయణ, సంజయ్, మహేందర్, ఆనంద్, అబ్బాస్, అరుణ్ భట్, అభిషేక్ తదితరులు ఉన్నారు.



