ఘనంగా మహానాడు వెడుకలు – డిజిటల్ మాహానాడును తిలకించిన టీడీపీ శ్రేణులు

రాష్ట్ర టీడీపీ అధిష్టానం ఆదేశం మేరకు మండలంలోని క్లస్టర్ల పరిధిలో కొత్త పాలెం, తూర్పుగంగవరం లో డిజిటల్ మహానాడు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కొత్తపాలెం, తూర్పుగంగవరం నందు టీడీపీ జె ఎండాను టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, క్లస్టర్ ఇంచార్జిలు కె.నాగార్జునరెడ్డి, రాచకొండ వెంకట్రావులు ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపకఅధ్యక్షులు మాజీ సీఎం ఎన్టీఆర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద, బడుగు వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను చూసి టీడీపీ పార్టీని స్థాపించి 9నెలల్లోనే అధికారం చేపట్టి రికార్డు సృష్టించారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పాలనలో ప్రజలకు ఎంతగానే మేలు జరిగిందని ఎన్టీఆర్ ఆశయ సాధనను సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.కొత్తపాలెంవద్ద క్లస్టర్ఇంచార్జీలు కె.నాగార్జునరెడ్డి, ఎన్ కళ్యాణ్ చక్రవర్తి ఆద్వర్యంలో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. తూర్పుగంగవరం లో కళ్యాణమండపం లో క్లస్టర్ ఇంచార్జిలు రాచకొండ వెంక ట్రావు, పాశం సూరిబాబుల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రపార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా తిలకించారు.
ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , రాష్ట్ర నాటక అకాడమి కార్పోరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్ రెడ్డి, వైస్ఎం పీపీ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు, గొళ్లపూడి వేణుబాబు, షేక్ కాలేషావలి, వల్లపునేని సుబ్బయ్య, శివనాగిరెడ్డి, పిన్నిక రమేష్ , సిహెచ్ వీర నాగిరెడ్డి, ఐ.వి.సుబ్బారెడ్డి, అనపర్తి సుబ్బారావు, షేక్ కాసిం సైదా, పేరిరె డ్డి, మహిళా నాయకురాలు మారాబత్తుల సుజాత, కోటఅంకమ్మ, మెలికా అంజమ్మ, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదటి రోజు డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *