జనగణన 2027 నమోదును వేగవంతం చేయాలని తహసీల్దార్ బి.వి.రమణారావు తెలిపారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యుమ రేటర్లతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా తహల్దార్ మాట్లాడుతూ మండలంలో జనగణన తక్కువ శాతం నమోదయిందన్నారు. ఎన్యూమరేటర్లు నిర్యక్ష్యం విడనాడి ఇంటింటికి సర్వే త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. యాప్ లో పొందు పరిచిన 31 అంశాలను క్షుణ్ణంగా విచారించి జనగణన సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన సమయంలో జనగణన పూర్తి చేయకుంటే ఎన్యూమనేటర్లపై
చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. కొందరు లక్ష్యానికి చేరువలో వున్నారని, కొందరు పూర్తిగా వెనుక బడి వున్నారన్నారు. నిర్యక్ష్యం వీడిత్వరిత గతిన జనగణన పూర్తి చేయాలన్నారు. రిపోర్టు ఆధారంగా వారితో మాట్లాడి ఎలా ముందుకు వెళ్లి పూర్తి చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ ఓ కె.వి.రామచంద్రరావు,
తదితరులు పాల్గొన్నారు.
