దర్శి డిఎస్పీ పి.బాలమురళీ కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ ను సోమవారం సందర్శించారు. స్టేషన్ లో
రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలు, మిస్సింగ్ కేసుల వివరాలు పరిశీలించారు. కేసుల పురోగతి సంతృప్తి కరంగా వుందన్నారు. రౌడీషీటర్లపై నిఘావుంచి వారి ప్రవర్తన ఎలా వుందో గమనిస్తూ వుండాలని ఎస్సైకు సూచించారు. ఈకార్యక్రమంలో దర్శి సీఐవై.రామారావు, ఎస్సై సింగంశెట్టి మల్లిఖార్జున రావు, సిబ్బంది వున్నారు.


