ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రెండేళ్ల పాలనలో అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్య మంత్రి ఎన్ . చంద్రబాబు నాయుడు అధి కారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క మహిళకైనా ఆ ప్రయోజనం అందలేదన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యో గాలు కల్పిస్తామని, ఉద్యోగాలు రాకపోతే
నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి యువతను మభ్య పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించకపోగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగు తున్నాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శి స్తోందని, గత ప్రభుత్వ హయాంలో ప్రారం భమైన వైద్య కళాశాలల నిర్మాణ పనులు నిలిచిపోయాయని
అన్నారు. రైతులకు గతంలో ఉన్న ఉచిత పంట బీమా సౌకర్యం లేకుండా పోయిందని, ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు, జూన్ 12న భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మేధావులకు ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్ విగ్రహాల ధ్వంసం పైశాచికం…
కూటమి పాలనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 715 హత్యలు జరిగాయని, అందులో అత్యధికం గా రాజకీయ హత్యలేనని చెప్పారు. మహిళల మీద అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మనంద రెడ్డి
పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొట్లా రామారావు, వైవీ వెంకటేశ్వర్లు, కేవీ రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, యరజర్ల రమేష్, దేవరప ల్లి అంజిరెడ్డి, భూమిరెడ్డి రవణమ్మ, దుపా చెంచిరెడ్డి, షేక్ మీరావలి, నాగమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

