తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయతీ సోమవర్పాడు గ్రామలో గల శ్రీవీరాంజనేయస్వామి సమీపాన గల శ్రీ లక్ష్మీనారాయణ స్వాముల(రావిచెట్లు, వేప చెట్టు)లకు టీటీడీవేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శుక్రవారం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. దేవస్థానం లో ఆధ్యర్యంలో నాటిన రావి, వేప(నింబ, అశ్వర్ధ) వృక్షాలను సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి స్వరూపులుగా భావించి శుక్రవారంశ్రవణా నక్షత్రంలో కళ్యాణం నిర్వహించారు. గ్రామవాసులు నారాయణం వెంకట రమణాచార్యులు, కనక రాజ్యలక్ష్మి దంపతులు కళ్యాణం నిర్వ. హించారు. ఈకార్యక్రమంలో టీటీడీ దేవస్థాననుండి తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ జి.మధుబాబు, వేదపండితులు, నారాయణం దీక్షితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
