బేగంపేట, జూన్ 5,(జె ఎస్ డి ఎం న్యూస్) :
పేద అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మూల రాజ్‌కుమార్ గౌడ్ జయంతి వేడుకలు శుక్రవారం బేగంపేటలోని దేవనార్ అంధ విద్యార్థుల పాఠశాలలో ఘనంగా జరిగాయి. అమీర్‌పేటకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాబా, వేణు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, అభిలాష్ రెడ్డి, కిషోర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ హాజరయ్యారు. ముందుగా రాజ్‌కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్‌కుమార్ గౌడ్ కుమారుడు గౌతమ్ గౌడ్, మనవడు తారక్‌లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అంధ విద్యార్థులకు వారు స్వయంగా భోజనాలు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు టి. మహేశ్వరి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు శ్రీహరి, నరేందర్, కిషోర్, ప్రవీణ్ రెడ్డి, శేఖర్, ఆరీఫ్, సంజయ్ పాల్గొన్నారు.



