ఎన్టీఆర్ విగ్రహంపై దాడిని ఖండించిన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీపతి.

బేగంపేట, జూన్ 6,(జె ఎస్ డి ఎం న్యూస్) :
నల్గొండలో దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీ రామారావు విగ్రహంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ‘అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం’ తీవ్రంగాస్పందించింది. విగ్రహంపై జరిగిన దాడిని సంఘం అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన ఎన్టీఆర్, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించిన మహానీయుడని కొనియాడారు. అలాంటి మహానేతను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేస్తూ ముద్ర వేయడానికి కొంతమంది నీచులు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగు ప్రజల కోసం, జాతి ఆత్మగౌరవం కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.
ఈ ఘాతుకానికి ఒడిగట్టిన దుండగులను వెంటనే పట్టుకుని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహంపై జరిగిన ఈ దాడిపై అభిమానులందరూ స్పందించి, తీవ్రంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *