ఏపీ ఏ ఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు నిర్వహించాలని ప్రకాశం జిల్లా వ్యవసాయాధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు పర్యవేక్షణ లో భాగం గా అద్దంకి మండలం లోని ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణం ను మంగళవారం పరిశీలించారు. యాప్ ద్వారా ఎరువులు రైతులకు అందించారు. ప్రతి రైతు కు ఎరువులు అందిస్తామని యూరియా మరియు DAP ఎరువులు రైతు సాగు చేసే విస్తీర్ణం ఆధారం గా ఎరువులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, టెక్నికల్ వ్యవసాయాధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు .
