,జూన్ 12,(జె ఎస్ డి ఎం న్యూస్) : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనుభవిష్యత్ సాంకేతిక
ప్రపంచానికి సగర్వంగా సిద్ధం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. నూతనసాంకేతికతనుఅందిపుచ్చుకునేలా కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ లిటరసీ,కంప్యూటేషనల్ థింకింగ్ వంటి భవిష్యత్ నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే నేర్పించేందుకు “కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ టీచింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఆన్ AI & డిజిటల్ లెర్నింగ్” అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దూరదృష్టితో, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఆలోచనలకు అనుగుణంగా ఈ వినూత్న నమూనాను రూపొందించారు. ఈ విద్యా యజ్ఞంలో భాగంగా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు “అన్న-అక్క మెంటర్‌షిప్ మోడల్” ద్వారా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మార్గదర్శకులుగా మారి డిజిటల్ విద్యనుబోధించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇందులో భాగంగా 139 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 53 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన దాదాపు 36,800 మంది విద్యార్థి ఇంటర్న్లు (33,900 మంది డిగ్రీ, 2,900 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు) సుమారు 9,000 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. వీరితో పాటు 520 మంది నోడల్ ఫ్యాకల్టీ సభ్యులు రంగంలోకి దిగుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి జేఎన్‌టీయూ హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు తమ సాంకేతిక, విద్యా పరమైన పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే 135 మంది ఇంజినీరింగ్ కళాశాలల మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశారు.ఈ మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల బృందంపర్యవేక్షిస్తోందికార్యక్రమ ప్రణాళిక, అమలులో ఐఏఎస్ అధికారిణి దేవసేన కీలక పాత్ర పోషిస్తుండగా, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలభాస్కర్ రాష్ట్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర నోడల్ అధికారిగా నియమితులైన డా. డి. సరిత కళాశాలల అనుసంధానం, పాఠశాలల మ్యాపింగ్, ఇంటర్న్లనియామకం, శిక్షణ ప్రణాళికలను సమన్వయంచేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాలిటెక్నిక్
కళాశాలల్లో ఈ కార్యక్రమ బాధ్యతలను సుష్మితపర్యవేక్షిస్తున్నారు. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రావు, ప్రొఫెసర్లు కామాక్షి ప్రసాద్, మంగు తదితరులు శిక్షణా ప్రక్రియలో మార్గనిర్దేశం చేస్తున్నారు. పై జామ్ ఫౌండేషన్ దీనికి సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తూ, ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు ప్రాంజలి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని, ట్రైనర్ వైశాక్ తెలంగాణ కోడ్ మిత్ర ఆన్‌బోర్డింగ్ బాధ్యతలను చూస్తున్నారు.
ఈ కార్యక్రమ పర్యవేక్షణ అంతా “తెలంగాణ కోడ్ మిత్ర” ప్లాట్‌ఫారమ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సాగనుంది. నోడల్ ఫ్యాకల్టీ, ఇంటర్న్ల నమోదు, పాఠశాలల మ్యాపింగ్, హాజరు, ఇంటర్న్‌షిప్ ట్రాకింగ్, ప్రగతి నివేదికలన్నీ ఈ డిజిటల్ వేదిక ద్వారానే నియంత్రించబడతాయి. ఇప్పటికే నోడల్ ఫ్యాకల్టీ ఎంపిక, డేటా సేకరణ, సమీక్ష సమావేశాలు వంటి సన్నాహక పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుండి 20 వరకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా నోడల్ ఫ్యాకల్టీకి శిక్షణ ఇస్తారు. అనంతరం జూన్ 21 నుండి 25 వరకు కళాశాల స్థాయిలో విద్యార్థి ఇంటర్న్లకు శిక్షణ ఇవ్వడంజరుగుతుందిజూన్ 30 నాటికి పాఠశాలల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసి, జూలై 1 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభిస్తారు.
ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విద్యార్థి ఇంటర్న్లు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, వారిలో AI అవగాహన, డిజిటల్ లిటరసీ, కంప్యూటేషనల్ థింకింగ్, కోడింగ్ ప్రాథమిక అంశాలు నేర్పిస్తారు. దాంతో పాటు బాధ్యతాయుత సాంకేతిక వినియోగం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆవిష్కరణలు, సృజనాత్మకత మరియు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై విస్తృత అవగాహన కల్పిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు మరియు సాంకేతిక సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి, “AI మరియు డిజిటల్ లెర్నింగ్ ద్వారా యువతకు సాధికారత–భవిష్యత్ తెలంగాణ నిర్మాణం” అనే నినాదంతో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అడుగు వేసింది.

