లాలాగూడ ముత్యాలమ్మ ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు, అన్నదానం

సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని లాలాగూడ రైల్వే క్వార్టర్స్ వెనకాల వెలిసిన శ్రీ సదాశివ దత్తాత్రేయ ముత్యాలమ్మ దేవాలయంలో రేపు (జూన్ 15, సోమవారం) అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ, కాళీమాత, పోచమ్మ అమ్మవార్లకు ఉదయాన్నే శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు జరగనున్నాయి.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం అత్యంత గొప్పదని, ముఖ్యంగా అమావాస్య రోజున అన్నదానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమానికి భక్తులందరూ భారీ సంఖ్యలో విచ్చేసి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి అయ్యప్ప కన్స్ట్రక్షన్స్ అధినేత సుధీర్, మాధవి, “ప్రజాప్రశ్న” దినపత్రిక జర్నలిస్ట్ గౌటి రామకృష్ణ (RK), లాలాగూడ ఇ.శంకరయ్య జనరల్ స్టోర్ నిర్వాహకులు సూరి, లాలాపేట వెంకటరమణ జనరల్ స్టోర్ నిర్వాహకులు శ్రీనివాస్, అలాగే స్వర్గీయ శ్రీ మామిడి నరసింహ రావు జ్ఞాపకార్థం మామిడి ఎన్ శ్రీనివాసరావు తదితరులు అన్నదాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల అమావాస్య రోజున ఇలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకునే దాతలు 9394334646 నెంబరులో సంప్రదించవచ్చని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *