గత రెండు రోజులుగా మీడియాలో తమ కుటుంబం పై వస్తున్న అసత్య ప్రచారాలు అవాస్తవమని దర్శి ఎమ్మెల్యే, వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీడియో ద్వారా ఆదివారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం మల్లన్న సొమ్మును తాము వాడుకుంటున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. గతంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, తన సోదరులు బూచేపల్లి కమలాకర్ రెడ్డి జ్ఞాపకార్థం శ్రీశైలంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి, కాటేజీలు నిర్మించడం జరిగిందన్నారు. అయితే ఆలయ అధికారులు తాము ఇప్పటివరకు కాటేజీలు హ్యాండ్ ఓవర్ చేయలేదని, మూడుసార్లు నోటీసులు పంపించినట్లు చెప్పటం అవాస్తమన్నారు. గత ఏడాది ప్రధాని మోడీ శ్రీశైలం వచ్చినప్పుడు కాటేజ్ తాళాలు అధికారుల వద్ద ఉన్నాయని, అలాగే గత శివరాత్రి పండుగ సందర్భంలో కూడా అధికారుల వద్ద ఉన్నాయన్నారు. రెవెన్యూ అధికారులు చిన్నచిన్న మరమ్మత్తులు కూడా చేయించారని పేర్కొన్నారు. మూడుసార్లు రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమకు నోటీసులు పంపించినట్లు అధికారులు చెబుతున్నారని, ఇప్పటివరకు తమకు ఒక నోటీసు కూడా రాలేదన్నారు. అదే నిజమైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అందుకు సంబంధించిన వివరాలు బయట పెట్టాలని , తమ తప్పు చేసి ఉంటే భేషరతుగా శ్రీశైలం మల్లన్నకు క్షమాపణలు చెప్పి, రూ. 10 లక్షలు పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. బూచేపల్లి కుటుంబం బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాలకు ఉదారంగా దానాలు చేస్తుంటామని, తమ తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరించి భక్తులందరికీ అన్నదానం చేస్తుంటామన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు పాలనుకు రెండేళ్లు పేరుతో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడం చూసి ఓర్వలేని కూటమి ప్రభుత్వ పాలకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ఇటువంటి అసత్య ప్రచారాలు చేయటం తగదని హితవు పలికారు. గతంలో తిరుమల వెంకన్న స్వామిని, ఇప్పుడు శ్రీశైలం మల్లన్న స్వామిని తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవటం సబబు కాదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడిపోవద్దని హితువు పలికారు.

