ప్రతిభా విద్యార్థులకు నగదు పురస్కారంఒంగోలు ఫోటో. విద్యార్థులకు నగదు పురస్కారం అందజేస్తున్న మాజీ రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు

ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ హల్ లో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆవోపా ప్రతిభ పురస్కార్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి వర్యులు శిద్దా రాఘవ రావు పాల్గొని విద్యార్థులకు నగదు పురస్కారం అందజేశారు .ఈ సందర్బంగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆవోపా చేస్తున్న సేవలు కొనియాడారు. సమాజ సేవలో అంకిత భావంతో పని చేసే వారికి అండగా ఉంటానని తెలిపారు. ఆర్యవైశ్య విద్యార్థులు క్రమ శిక్షణతో రాణించి తల్లితండ్రులకు, సమాజానికి దేశానికీ మంచి పేరు తేవాలని సూచించారు. నూతన ఆవోపా కార్యవర్గానికి తన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆవోపా గౌరవ ప్రెసిడెంట్ తడవర్తి రాంబాబు, వాసవి సత్ర సముదాయల అధ్యక్షులు దేవకీ వెంకటేశ్వర్లు, గ్రంధి బాల, శ్రీమతి సుగ్గు పద్మశ్రీ, మలిపెద్దు నాగేశ్వరావు, శ్రీమతి ఆరవీటి నిర్మల, రావిపూడి లక్ష్మి నారాయణ, చలువాది బదరి నారాయణ, కూరపాటి సత్యనారాయణ, ఆవోపా మహిళా సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *