గ్రామీణ మహిళా సంఘాలు ఆర్థిక అక్షరాస్యతలో బలో పేతం కావాలని ఏపీఎం పి.దేవరాజ్ అన్నారు. తాళ్లూరు
వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక మహిళలకు వార్షిక నివేదిక, నిర్వ హణపై శుక్రవారం జరిగిన శిక్షణకు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత అధ్యక్షత వహించారు. ఏపీఎం మాట్లాడుతూ వార్షిక నివేదికను క్రమం తప్పకుండా నిర్వహించటం వల్ల సంఘం ఆర్థికస్థితి పార దర్శకంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్త్రీనిధి మేనేజర ధరణి, సీసీ కోటేశ్వర రావు, సీవో కుమారి, తదితరులు పాల్గొన్నారు.
