తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ పార్టీ సంయుక్త కార్య దర్శి ఐ. వి సుబ్బారెడ్డి కి రాష్ట్ర స్థాయి పదవి దక్కింది. వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు… వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఐ .వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ..నా పైన నమ్మకముంచి నాకు ఈ పదవి ఇచ్చినా వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి , ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కీ , జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ కి,రాజ్యసభ సభ్యులు వై.వి .సుబ్బారెడ్డి కి మరియు రాష్ట్ర వైసీపీ మేధావుల సంఘం కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తానని అన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
