బేగంపేట , జూన్ 19:(జె ఎస్ డి ఎం న్యూస్) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని బేగంపేట డివిజన్ పరిధిలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ యువ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు స్థానిక నిరుపేదల షెల్టర్‌ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న నిరుపేదలు, అనాథలతో కలిసి రాహుల్ గాంధీ జన్మదిన కేక్‌ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నిరుపేదలకు, వృద్ధులకు అభిషేక్ అడపా చేతుల మీదుగా పండ్లను పంపిణీ చేశారు. సమాజంలో వెనుకబడిన, నిరుపేద వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్న రాహుల్ గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ సేవ కార్యక్రమం షెల్టర్ లోని నిరుపేదల ముఖాల్లో ఎంతో ఆనందాన్ని నింపింది.
ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్, సలీం ఖాన్, మునీర్ ఖాన్, నసీర్ అడ్డు, సాయి బాబా, శంకర్, అయ్యుబ్, అజ్మల్, మాజిద్, అఫ్సర్, సురేష్, ప్రవీణ్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

