ఓటరు సవరణ పై శిక్షణ కార్యక్రమంతో మరింతగా అవగాహన కలుగుతుంది…పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్.

బేగంపేట, జూన్ 19,( jsdmnews)
ఓటరు సవరణ పై శిక్షణ కార్యక్రమంతో మరింతగాఅవగాహన కలుగుతుందని,పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం బేగంపేట లోని పాటిగడ్డ మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభమయ్యే SIR కార్యక్రమంలో ఏజెంట్ లు పాల్గొనాలని, ఓటర్లకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. అర్హులైన ఓట్లు తొలగింపు కాకుండా చూడాలని, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా బాధ్యతతీసుకోవాలని చెప్పారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుజాత, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కుమార్ ల ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ లో బిఆర్ఎస్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీహరి, అశోక్ యాదవ్, నరేందర్, ఏసూరి మహేష్, లక్ష్మీపతి, శేఖర్, ఆరీఫ్, ప్రేమ్, మహేందర్ గౌడ్, ఫహీం, వెంకట్ బాబు, నాగలక్ష్మి, అనిత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *