సికింద్రాబాద్ జూన్ 23:(జె ఎస్ డి ఎం న్యూస్) : ప్రపంచ ఒలింపిక్ డేని పురస్కరించుకుని మంగళవారం (జూన్ 23, 2026) నగరంలో 40వ ప్రపంచ ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమైంది. భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ సంఘంతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS), పోలీసు మరియు పురపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం (గాంధీ బొమ్మ) వద్ద ప్రారంభమైన ఈ ఒలింపిక్ రన్, లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్బీ) స్టేడియం వరకు సాగింది.
ఈ 40వ ఒలింపిక్ రన్ కమిటీ చైర్మన్ చీర సత్యనారాయణ (శ్రీకాంత్) ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఈ పరుగును అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుక విజయవంతం కావడంలో ప్రోగ్రాం కన్వీనర్లుగా వ్యవహరించిన ఎస్. కుమార్, ఎ. ప్రతాప్ రెడ్డి, మరియు కో-కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన బాక్సింగ్ కోచ్ కె. కృష్ణ ముఖ్య పాత్ర పోషించారు.
ఈ క్రీడా సంబరంలో వాటర్ స్పోర్ట్స్ ఒలింపియన్, ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత మంజీత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన క్రీడా జ్యోతిని వెలిగించి, ఇతర క్రీడాకారులతో కలిసి పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఒలింపిక్ రన్లో పెద్ద సంఖ్యలో యువ క్రీడాకారులు, పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు.
