పల్స్ పోలియో విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని తాళ్లూరు పీ హెచ్
సి వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. తాళ్లూరు మండల కేంద్రంలో శనివారం పల్స్ పోలియో పై అవగాహన కల్పిస్తూ వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాళ్లూరు పిహెచ్ సి వరధిలో జీరో నుండి ఐదు నంవత్సరాల లోవు పిల్లలు 2,176 మందికి పల్స్ పోలియో చుక్కలు వెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అందులో ఒక ట్రాన్స్ టీం, ఒక మొబైల్, 15 పోలింగ్ బూత్ ల లో చుక్కలు వెయ్యనున్నట్లు తెలిపారు. 29, 30 తేదీలలో రెండు రోజుల పాటు నివాసాల వద్దకు తిరిగి మొదటి రోజు వేయించుకోని వారికి వల్స్ పోలియో వెయ్యనున్నట్లు చెప్పారు. సి హెచ్ ఓ రమణమ్మ , హెచ్ ఎస్ వీ వీ రవి, ఫార్మాసిస్ట్ రమేష్, ఆరోగ్య కార్యకర్తలు అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
