హైదరాబాద్ జూన్ 30(జే ఎస్ డి ఎం న్యూస్)
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారంనిర్వహించిన 234వ సీఎం ప్రజావాణికార్యక్రమంలో మొత్తం 408 దరఖాస్తులు అందాయి. వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 220, రెవెన్యూ శాఖకు సంబంధించి 58, మున్సిపల్ శాఖకు 22, ప్రవాసి ప్రజావాణికి 03 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 105 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించి ఎండార్స్ మెంట్ చేసి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దివ్యాంగులు,
మరుగుజ్జులు సీఎం
ప్రజావాణికి వచ్చి వారి సమస్యలు తెలిపారు. రేషన్ కార్డులుఇప్పించాలని, ఉపాధి కోసం మీ – సేవా కేంద్రాలను కేటాయించాలని, డబుల్ బెడ్ రూం లను ఇప్పించాలని వారు ఇంచార్జి చిన్నారెడ్డిని కోరారు. వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులకు చిన్నారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
