రాంగోపాల్‌పేట్, జూన్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లను బి జే పి నాయకులు సందర్శించారు.
ఓటర్ల నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక నివాసితులను బూత్ స్థాయి అధికారులతో (బీఎల్ఓ) అనుసంధానించే ప్రక్రియలో నేతలు చురుగ్గా పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో సీనియర్ నాయకులు చీరె శ్రీకాంత్, ఎస్.ఆర్. మల్లేష్ తో పాటు మదన్, ధన్‌రాజ్, సంతోష్, యశ్వంత్, వెంకన్న, తదితరులు పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు.

