సింగరాయకొండ వద్ద నున్న ఎన్ హెచ్ -16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

సింగరాయకొండ వద్ద నున్న ఎన్ హెచ్ -16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
అధికారులను ఆదేశించారు.
సింగరాయకొండ వద్ద నున్న ఎన్ హెచ్ -16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు, సంబంధిత అధికారులతో కలసి సింగరాయకొండ వద్ద నున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు ను పరిశీలించి ఎన్హెచ్ఏఐ, రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కనమళ్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు నిత్యం ఏదో ఒక పనిమీద సింగరాయకొండకు వెళ్లడం గాని, అలాగే తమ పొలాలకు వెళ్లడం గాని జరుగుచున్న సమయంలో సరైన రోడ్డు ఆక్సిస్ లేక ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మేజర్ గా రోడ్డు ప్రమాదాలు జరుగుచున్న ప్రదేశాలను పరిశీలించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగానే ఈ రోజు సింగరాయకొండ వద్ద గల ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు ను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ సదుపాయాన్ని పునరుద్ధరించడం, అలాగే కనమళ్ళ నుండి సింగరాయకొండ వరకు సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయడం, అవసరమైన ప్రదేశాల్లో అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా కలెక్టర్ వెంట NHAI పిడి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిటీసీ సుశీల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *