సేవే పరమావధిగా దూసుకుపోతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి శాఖ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దర్శి రోడ్డులోని మానవతా భవన్‌లో సంస్థ జిల్లా అధ్యక్షులు యలమందారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పొలిలి శాఖ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కమిటీ సభ్యులు అత్యంత ఉత్సాహంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
పొదిలి శాఖ నూతన అధ్యక్షులుగా సోమిశెట్టి చిరంజీవి, కార్యదర్శిగా చిట్టెంశెట్టి వెంకట కృష్ణారావు, కోశాధికారిగా బండి అశోక్ ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలుగా వై. కిరణ్మాయి, ఉపాధ్యక్షులుగా పైడిమర్రి శ్రీనివాస రావు, సంయుక్త కార్యదర్శిగా భూమా సుమంత్, మీడియా ప్రతినిధిగా షేక్ బాజీ, మరియు పర్యావరణ కమిటీ ప్రతినిధిగా మేడా నరసింహారావుతో పాటు ఇతర విభాగాల సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మువ్వల పార్ద సారధి , సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, కల్లం సుబ్బారెడ్డి , ఆనికాల వీరారెడ్డి , గురుస్వామి , కేశవరావు , అప్పల శంకర్ , సోమిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

