ఓటర్ల నమగ్ర నర్వే సర్ లో డిజిటలైజేషన్ ను వేగవంతం చెయ్యాలని దర్శి అసెంబ్లీ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎ శాంతి లక్ష్మి కోరారు. మండలంలోని విఠలాపురం, తాళ్లూరు లలో 254,250 పోలింగ్ బూత్ ల పరిధిలో నర్ ప్రక్రియ డిజిటలైజేషన్ తక్కువగా ఉండటాన్ని ఆమె పరిశీలించి తగిన సూచనలు చేసారు. ఓటర్ కు సంబంధించి విజిబుల్ ఫోటో ఉంటే వారి నుండి ఫోటో కలెక్ట్ చేయవలసిన అవసరం లేదని చెప్పారు. ఎన్యుమరేషన్లో పూరించ వలసిన వాటిని పూర్తి చేసి ఓటరు, బి ఎలీ ఓ ల సంతకాలు చేసిన తర్వాత ఎన్యుమరేషన్ మొదటి పేజీని మాత్రము అప్ లోడ్ చెయ్యాలని చెప్పారు. రెండవ పేజీ అప్ లోడ్ చేయ్యవలసిన అవసరం లేదని తెలిపారు. తహసీల్దార్ రమణా రావు, ఆర్. ఐ సుధీర్, బి ఎస్ఓ లు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సూపర్ వైజర్లతో నమావేశం నిర్వహించి ఎన్యుమరేషన్ ను వేగవంతం చెయ్యాలని తహసీల్దార్ రమణా రావు కోరారు.
