తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం లో భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్ వర్ధంతి వేడుకలు…..

బేగంపేట జులై 6 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం (బుద్ధభవన్ )లో భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్ వర్ధంతి వేడుకలు
ఘనంగానిర్వహించారు. చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి డాక్టర్ బాబుజగజ్జివన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులుఅర్పించారుఈ సందర్భంగా చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మిమాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జివన్ రామ్ అందరికిఆదర్శప్రాయమని అన్నారు. భారత దేశ ఉప ప్రధానిగా ఎన్నో సేవలుఅందించారన్నారు. భారతదేశ చరిత్రలోనే సుమారు 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారని అన్నారు. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన సమయంలో వ్యవసాయ మంత్రిగా ఆయన అందించిన సేవలుచిరస్మరణీయమైనవి అన్నారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన
మహనీయుడని కొనియాడారు. 1935లో ‘ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్’ అనే సంస్థను కూడా స్థాపించి జగజ్జివన్ రామ్ సేవలు అందించారని అన్నారు. వారి వర్ధంతి సందర్బంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీమతి కాసోజు శంకరమ్మ , శ్రీమతి శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి , రాధాబాయ్ , ఉజ్మా ఆషయ్ షాకీర్ , కార్యదర్శి పద్మజ రమణ , కమిషన్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *