బేగంపేట జులై 6, (జే ఎస్ డి ఎం న్యూస్) : ఎమ్మెల్యే తలసాని ఆదేశాల మేరకు పాటిగడ్డ ఫ్లై ఓవర్ కు ప్రత్యామ్నాయ మార్పులు చేస్తున్నారు.
ఈ మేరకు సోమవారం మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాలనీ వాసులు తలసాని ని కలిసి కృతఙ్ఞతలుతెలియజేశారు. నెక్లెస్ రోడ్డు నుండి బేగంపేట లోని పాటిగడ్డ కాలనీ మీదుగా వంతెన నిర్మాణం విషయంలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి ఫలించింది. తొలుత నెక్లెస్ రోడ్డు నుండి బేగంపేట లోని పాటిగడ్డ కాలనీ మీదుగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదించి స్థల సేకరణ కోసం పాటిగడ్డ వాసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. విషయంతెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గత సంవత్సరం నవంబర్ 28 వ తేదీన అధికారులతో కలిసి పాటిగడ్డ లో పర్యటించారు. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న పేదల ఇండ్లను తొలగిస్తేఊరుకోబోమని స్పష్టం చేశారు. పేదలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ కు ప్రత్యామ్నాయ మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ నుండి మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్ సమీపం వరకు 800 మీటర్ల పొడవుతో 152 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు ప్రాజెక్ట్ ఏ ఈ ప్రశాంత్ వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. తమ ఇండ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మాణం డిజైన్ మార్పు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పాటిగడ్డ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాటిగడ్డ వాసులు రఫిక్, అజీమ్, తోపిక్, ఆసీఫ్, అతిక్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, శేఖర్, అఖిల్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.

