బన్సీలాల్ పేట,జులై 5(జే ఎస్ డి ఎం న్యూస్) :
బన్సీలాల్ పేట నమస్తే తెలంగాణ విలేఖరి నర్సింగ్ రావు కి ఇటీవల గుండెపోటు రావడంతో, వారి కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు గుండె నాళాల్లో ఏర్పడిన మూడు బ్లాక్‌లకు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం నర్సింగ్ రావు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయంతెలుసుకున్న రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి ఆదివారం సాయంత్రం
న్యూ బోయిగూడ
లోని నర్సింగ్ రావు నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పి, కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు.మర్రి వెంట స్థానిక బిజెపి నాయకులు శీలం శివలింగం, రాజు, గుంటిసత్యనారాయణ, కిరీటి, గోపి
శ్రీనివాస్, పిట్ల శ్రీనివాస్, దొండే సురేష్, సగత్ వంశీ, అన్నెపాక స్వామి, శ్రవణ్ తదితరులు ఉన్నారు.

