బాపట్ల జులై 6,రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం తెలియజేశారు. సోమవారం బాపట్లలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ వివిధ హోదాలో ఉన్న ముఖ్య నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలోపేతనం చేయటం కోసం తీసుకోవలసిన చర్యలను ఆయన వివరించారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, విద్యార్థి,యువత, రైతు, మహిళ తదితర విభాగాలన్నిటికీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం గ్రామ కమిటీని ఎన్నుకోవడం అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీలను ఎన్నుకోవడం ప్రత్యేక కార్యచరణ ద్వారా నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని అమలు జరిగేలా చేయాలని కోరారు అదే విధంగా దేశంలో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలని భారత దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ ఇప్పుడు ఉన్న కూటమి పార్టీలు పరిపాలన అంతా కూడా ప్రజలు గమనించారని దీని ద్వారా పేదలకు మేలు జరిగింది ఏమీ లేదని ఆయన తెలియజేశారు రాజకీయ శూన్యత ఆంధ్రప్రదేశ్లో ఉందని ఇదే సమయంలో పార్టీని బలపరచడం ద్వారా రాబోయే రోజుల్లో దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటంతో పాటురెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో వచ్చేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాలని జె డి.శీలం దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు బాపట్ల పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబురావు, దేవరాజు ,సంతనూతలపాడు ఇన్చార్జి పసుమర్తి సుధాకర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
