నాగులుప్పలపాడు: జూలై ,6, మండల కేంద్రమైన నాగులుప్పలపాడు గ్రామపాస్టర్ ముంగరశిఖామణి అనారోగ్యంతో ఇటీవలమృతి చెందారు ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ పసుమర్తి సుధాకర్ సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి పాస్టర్ శిఖామణి చిత్రపటానికిపూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఆయన మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ వెంట మోదేపల్లి మాజీ ఎంపీటీసీ అనపర్తి వర్ధనరావు, శ్యాము,తదితరులు పాల్గొన్నారు .
