ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 85 ఫిర్యాదులు

జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి. శ్రీధర్ మరియు పోలీసు అధికారులతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులు స్వీకరించారు.పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల యొక్క సారాంశం తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో దర్శి సీఐ రామారావు,ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి రావు,గుడ్లూరు ఎస్సై కె.వెంకట్రావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై యాసిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *